అరే ఎన్నెన్నో వింతలే
అరెరే మబ్బుల్లో గంతులే
చేతిలో తారలే
మాటలో రంగులే
శ్వాసలో కాంతులే
చేరుతున్నవె
ఇపుడే పరిచయమే పరిచయమే ప్రేమ ప్రపంచమే
ఇపుడే పరిచయమే సంబరమే ఏదో కొత్త బంధమే
అరే ఎన్నెన్నో వింతలే
అరెరే మబ్బుల్లో గంతులే
చుట్టూ ఎన్నో వాన విల్లులే
వెండి వెన్నెల నదులే
పట్టు తేనెల రంగవల్లులే
పసిడి పరిమళ నిధులే
మంచు పువ్వుల జ్వాలలే
మల్లె నవ్వుల గాలులే
గాలి ఊసులే
ఇపుడే పరిచయమే పరిచయమే ప్రేమ ప్రపంచమే
ఇపుడే పరిచయమే ప్రియస్వరమే ఏదో కొత్త రాగం
అరే ఎన్నెన్నో వింతలే
అరెరే మబ్బుల్లో గంతులే
నువ్వేదురోస్తే అది ఉదయం
చెంత చేరితే సాయంత్రం
నువ్వు చేయి పడితే అది సరసం
అడుగు కదిపితే అది విరహం
జంట ఉన్నది జీవితం
పంచుకోన్నది అమృతం
ఇంత అద్భుతం
ఇపుడే పరిచయమే పరిచయమే ప్రేమ ప్రపంచమే
ఇపుడే పరిచయమే తొలి వరమే ఏదో కొత్త బంధమే
0 Comments